మనం వంట చేసుకుంటే అందులో కచ్చితంగా జీలకర్ర ఉంటుంది.. వంట గదిలో జీలకర్ర లేని ఇళ్లు ఉండదు, శరీరానికి ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.అసలైన రుచి, సువాసన. జీలకర్ర పొడిని కూరల్లో వాడితే అమోఘమైన రుచివస్తుంది. ఇక చాలా మంది జీలకర్ర పొడి గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగుతారు.
అలాగే జీర రైస్ కూడా తీసుకుంటారు ఇదంతా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని..
జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఏ, సీలు పుష్కలంగా ఉంటాయి.
జీలకర్రను నీటిలో మరిగించి వడబోసి ఆ వాటర్‌ను తీసుకుంటే ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక జీర్ణసమస్యలు ఉండవు, కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి. మనిషికి ఎసిడిటీని నివారిస్తుంది. మహిళలకు రుతు స్రావం సమస్యలు తొలగిపోతాయి.
జీరాలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కనుక వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది. మన ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని పలుచన చేస్తుంది. దీని వల్ల ఆస్మా సమస్యలు జలుబు దగ్గు రాకుండా ఉంటాయి.జీరా నీరు గర్భిణులు, బాలింతలకు మంచిది. డాక్టర్ ని అడిగి తీసుకుంటే మంచిది.