పెరుగు – ఆవకాయ – ఉల్లిపాయ ఈ కాంబినేషన్ ట్రై చేస్తున్నారా ఇది చదవండి

Curd - Avakai - Onion combination Secrete

0
129

ఈ రోజుల్లో అందరూ టిఫిన్స్ అలవాటు చేసుకుంటున్నారు. గతంలో అసలు ఉదయం చల్ది అన్నం అలాగే ఉల్లిపాయ లేదా పచ్చడి పచ్చిమిర్చి వేసుకుని అన్నం తిని పొలం పనులకి వెళ్లేవారు. ఇప్పుడు కూడా కొందరు దీనిని ఫాలో అవుతున్నారు. అయితే ఉల్లిపాయ కన్నీరు తెప్పిస్తుంది కాని ఒంటికి చాలా మంచిది. ముఖ్యంగా బాగా కడుక్కుని పచ్చిఉల్లిపాయని పచ్చడి లేదా పెరుగు అన్నంతో తినవచ్చు.

అందుకే అంటారు ఉల్లిపాయ చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతగా . ఉల్లిపాయ శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉండేలా చేస్తుంది.అందుకే పెద్ద‌లు చాలామంది ఉల్లిపాయను తింటూ ఉంటారు. ఇక ఆవకాయ పచ్చడి తింటే అందులో ఉల్లిపాయ ఉండాల్సిందే, బిర్యానీ తిన్నా అందులో ఉల్లి ఉండాల్సిందే.

మరి ఉల్లిలో అన్ని అద్భుత గుణాలు ఉన్నాయి కాబట్టే ఉల్లిపాయ తినమని సలహా ఇస్తారు వైద్యులు. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి ఈ ఉల్లిపాయ‌లు. మీరు పచ్చిఉల్లిపాయని పెరుగు అన్నంలో తింటే శరీరంలో ఇమ్యునిటీ పవర్ బాగా పెరుగుతుంది. అంతేకాదు ఆకలి అనేది వేయదు. షుగర్ ఉన్న వారు కూడా ఉల్లిపాయ తీసుకోవచ్చు. ఇక అలర్జీ సమస్యలు రావు, గొంతు నొప్పి దగ్గు ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి. చిన్న ఉల్లి కూడా ఘాటు ఉంటుంది శ‌రీరానికి మేలు చేస్తుంది.