పెరుగు తింటే శరీరానికి ఎంతో మంచిది అంటారు.. శరీరానికి అన్ని పోషకాలు రావాలి అంటే కచ్చితంగా అన్ని రకాల ఆహరాలు తినాలి అందుకే పెరుగుని కూడా ఎప్పుడూ వద్దు అని అనకూడదు.. కాని కొందరు పెరుగు పేరు చెబితే బాబోయ్ అంటారు, కాని పెరుగు శరీరానికి చాలా మంచిది..
అయితే పెరుగుతో కొన్ని ఆహారాలు కలిపి తింటే మీకు చాలా మంచిది.. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. కొద్దిగా జీలకర్ర ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు . ఇక మీకు నల్ల ఉప్పు తెలుసుగా దానిని 25 గ్రాములు పొడిచేసుకోండి దానిని పెరుగులో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు కడుపు నొప్పి తగ్గుతాయి.
పెరుగులో కొద్దిగా చక్కెర కలుపుకుని తింటే చల్లగా ఉంటుంది శరీరానికి శక్తి వస్తుంది.. కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి . దీని వల్ల నోటి పూత , దంతాల నొప్పి , ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి .ఇక పెరుగు మిరియాల పొడి కొద్దిగా తీసుకుంటే మలబద్దకం పోతుంది. ఇక పెరుగులో పండ్ల ముక్కలు ఫ్రెష్ వి వేసుకుని తింటే ఇమ్యునిటీ పవర్ బాగుంటుంది, పెరుగుతో తెనె కలిపి తీసుకుంటే కడుపులో అల్సర్స్ పోతాయి.