ఎపిలో ఆ 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు : తగ్గిన కరోనా కేసులు

Curfew relaxation in Andhrapradesh

0
111

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాలలో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆంక్షలు సడలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు కొంతమేరకు సడలించారు. ఆ వివరాలేటో చూద్దాం…
కోవిడ్ పాజిటీవ్ రేట్ 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో కర్ఫ్యూ ను సడలించారు. 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ ను సడలించారు. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాలని ఆదేశాలిచ్చారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ విధానం జులై 1 నుంచి జులై 7 వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత పాజిటివిటీ రేట్ పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సడలింపు విధించిన ఆ 8 జిల్లాలు ఇవే…
1 అనంతపురం
2 కర్నూలు
3 కడప
4 గుంటూరు
5 నెల్లూరు
6 విశాఖపట్నం
7 శ్రీకాకుళం
8 విజయనగరం
ఇక కర్ఫ్యూ ఆంక్షలు పాత పద్ధతిలోనే అమలులో ఉన్న జిల్లాలు ఏవేవో ఒకసారి చూద్దాం..
1 తూర్పు గోదావరి
2 పశ్చిమగోదావరి
3 కృష్ణా
4 చిత్తూరు
5 ప్రకాశం
పై ఐదు జిల్లాల్లో కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రతిరోజు త్రిబుల్ డిజిట్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా తీవ్రంగా ఉంది. అందుకోసమే ప్రభుత్వం ఈ జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు కొనసాగిస్తోంది. కోవిడ్ పాజిటీవ్ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు ఎత్తేయగా అంతకన్నా ఎక్కువ ఉన్న జిల్లాల్లో కంటిన్యూ చేస్తున్నారు.
ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాత పద్ధతిలోనే కర్ఫ్యూ కొనసాగనుంది.
మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. రాత్రిపూట కర్ఫ్యూ కూడా ఎత్తిపడేశారు. అయితే తెలంగాణలో త్రిబుల్ డిజిట్ కేసులు మాత్రమే వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో సున్నా కేసులు కూడా నమోదవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ ఇంకా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేసులు తీవ్రత తక్కువగా ఉన్న 8 జిల్లాలను ఐడెంటిఫై చేసిన ఎపి సర్కారు ఆ జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలించింది.