దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

0
84

ఈ వర్షాకాలం వచ్చింది అంటే చాలు జలుబు దగ్గు వేధిస్తుంది, ఈ సమయంలో ఎంత వేడి నీరు తాగినా కొందరికి ఈజీగా ఈ జలుబు అటాక్ చేస్తుంది, చలి వానలో అసలు వెళ్లకూడదు, అయితే ఇలా పొడి దగ్గు వస్తున్నా కపంతో కూడిన దగ్గు వస్తున్నా మూడు నాలుగు రోజులకి తగ్గాలి లేకపోతే అలసత్వం చేయకూడదు… మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు ఏం చేయాలో చూద్దాం.

గోరు వెచ్చిన నీరు తీసుకుని నిమ్మరసం అందులో పోసి తాగాలి… అందులో తేనే టేబుల్ స్పూన్ వేసుకోండి దగ్గు సమస్య తగ్గుతుంది, అలాగే పైనాపిల్ పండ్లలో ఉండే బ్రొమెలెన్ దగ్గును త్వరగా తగ్గిస్తుంది. పైనాపిల్ పండ్లను తినడం ద్వారా దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు.

ఓ పెద్ద పాత్ర తీసుకుని అందులో పచ్చని పుదీనా ఆకులు వేసి మరిగించాలి. ఆ తరువాత వచ్చే మిశ్రమాన్ని తాగితే దగ్గు తగ్గుతుంది. అల్లం నిమ్మరసం నీటితో తీసుకుని తాగినా తగ్గుతుంది.