ఉరుకులూ పరుగుల జీవితంలో మనిషి ఆహార అలవాట్లతో పాటు రోజు వారి చేసే కార్యక్రమాలు కూడా మార్చుకుంటున్నాడు… ఇలా చేయడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు నిపుణులు… వర్క్ ఫ్రెజర్ వల్ల కొంత మంది టిఫెన్ చేసిన తర్వాత స్నానం చేస్తున్నారు…
అలాగే రాత్రి తిన్న తర్వాత స్నానం చేస్తున్నారు… అలా చేస్తే రాత్రి మంచిగా నిద్రపడుతుందని అనుకుంటారు… ఇలా స్నానం చేయకముందు తింటే అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు… రోజు స్నానం చేయకపోవడం కూడా ఒక వ్యాధితో సమానం.. రోజు స్నానం చేస్తే చర్మ వ్యాధులకు కారణమయ్యే హానికరమైన వ్యాధికారకాలను తరిమి కొడతాయి…
ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ఎంత మంచి క్రీమ్ వాడినా చర్మం పట్ల సరైన శ్రద్ద లేనప్పుడు మొటిమలు వస్తాయని అంటున్నారు.. కొంత మంది స్నానం చేయకుండా సెంటు కొట్టుకుని ఆఫీస్ కు వెళ్తుంటారని అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని అంటున్నారు.