చాలా మంది నిత్యం ఇంటిలో దేవుడికి దూప దీప నైవేద్యాలు పెట్టేవారు ఉంటారు, ఇంటిలో పూజ పూర్తి కాకుండా వంట పని కూడా మొదలు పెట్టని మహిళలు ఉంటారు, అయితే రోజూ ఒకో దేవుడ్ని పూజించడం మనకు శాస్త్రాల ప్రకారం అలవాటు అయింది, ప్రతీ రోజూ ఆ దేవునికి విశిష్టమైన రోజు అంటాము.. సోమవారం శివుడు -మంగళవారం హనుమాన్ ఇలా.. అయితే ఆ స్వామికి ఎలాంటి ప్రసాదం పెడితే మంచిదో ఇప్పుడు పండితులు చెప్పింది తెలుసుకుందాం
ఇలా ప్రతీ రోజూ కాకపోయినా.. మీరు వారానికి ఇద్దరు ముగ్గురు దేవుళ్లకి ఇలా నైవేద్యం పెట్టి పూజిస్తే ఇంటికి శుభం జరుగుతుంది.. మరి ఏ రోజు ఏం దేవునికి నైవేద్యం పెట్టాలి అనేది చూద్దాం.
శివుడు- ఆయనకు పాలతో సోమవారం అభిషేకం చేయండి ఆవుపాలతో మాత్రమే
హనుమంతుడు- మంగళవారం ఆయనకు అప్పాలు నైవేద్యం పెట్టండి, తమలపాకుతో వీలైతే పూజ చేయండి.
బుధవారం- అయ్యప్పకి ఏ పండు ఇచ్చినా మంచిదే
గురువారం – సాయిబాబాకి ఆరోజు కోవా చపాతిలాంటివి నైవేద్యం పెట్టండి
శుక్రవారం- అమ్మవారికి పాలతో చేసిన పరమాన్నం, శనగలు నైవేద్యం పెట్టండి
శనివారం- వెంకన్నకు కూడా క్షీరంతో చేసిన ప్రసాదం పెట్టండి, లేదా శనగ వడ పెట్టండి
ఆదివారం- సూర్యనారాయణకుడికి పరమాన్నం చెరకుతో పెట్టండి ఇలా చేస్తే చాలా మంచిది