భారత్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. మరోసారి కరోనా కేసుల ఉధృతి పెరిగింది. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు వెలుగుచూశాయి. మరో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం దేశ వ్యాప్తంగా ఉన్న ఓమిక్రాన్ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,49,60,261 కు చేరుకుంది. అదే సమయంలో 15 రోజుల క్రితం వరకు 1 లక్షకు దగ్గరగా ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు 1,71,830కి పెరిగాయి. అదే సమయంలో దేశంలో కరోనా నుండి కోలుకుంటున్న రోగుల సంఖ్య 3,43,06,414 కు పెరిగింది.
మరోవైపు కరోనా డెల్టా వేరియంట్‌తో పాటు..ఓమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కి చేరింది. మహారాష్ట్ర , ఢిల్లీలో అత్యధికంగా 568 , 382 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.