ఓసారి వాడిన ఆయిల్ మళ్లీ మళ్లీ వాడుతున్నారా అయితే డేంజర్ ఇది తెలుసుకోండి

Danger if Used Oil Is Reusing Again

0
62

ఈ విషయం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే హెల్త్ కి సంబంధించినది. చాలా మంది ఒకసారి వాడిన నూనెని మళ్లీ మళ్లీ వాడుతూ ఉంటారు. ఉదాహరణకు చూసుకుంటే బోండాలు, పునుగులు, బజ్జీలు, పూరీలు, వడ, గారెలు వేసిన సమయంలో ఆ నూనెని మళ్లీ కొన్నింటికి వాడుతూ ఉంటారు. అయితే కొన్ని హోటల్స్ లో అదే దోశకి కూడా వాడుతూ ఉంటారు. ఇలా ఓసారి వాడిన నూనెని మళ్లీ మళ్లీ వాడద్దు అంటున్నారు వైద్యులు.

ఇలా ఓసారి వాడిన నూనెలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది తింటే మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది. చెడు కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. ఎక్కువగా గుండె జబ్బులు హై బీపీ రావడానికి ఇదే ప్రధాన కారణం.జీర్ణ సమస్యలు వస్తాయి. లివర్ కు కూడా ఇబ్బంది. బయట రెస్టారెంట్ ఫుడ్ కొందరు తరచూ తింటూ ఉంటారు. ఇలాంటి వారికి ఈ ఇబ్బందులు వస్తాయి అంటున్నారు నిపుణులు.

బీపీ సమస్య ఉంటే మీరు ఈ ఆయిల్ ని వాడటం మానేయడం మంచిది. మీకు ఎంత అవసరమో అంతే ఆయిల్ వేసి ఆ వంటలు చేసుకోండి .మళ్లీ మళ్లీ దోసెలకు తాళింపులకి ఇలా ఆ వాడిన ఆయిల్ ని మాత్రం వాడద్దు. పిల్లలకు కూడా ఇది చిన్నతనం నుంచి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. పామాయిల్ సన్ ప్లవర్ అస్సలు ఈ విధంగా మళ్లీ మళ్లీ వాడిందే వాడద్దు అని వైద్యులు చెబుతున్నారు.