వైద్యులు పండ్లు తింటే మంచిది అని చెబుతారు, అందుకే చాలా మంది రైస్ రొట్టెలె మానేసి పండ్లు తింటూ ఉంటారు, ముఖ్యంగా కొందరు ఉదయం పూట టిఫిన్ మానేసి పండ్లు అల్పాహారంగా తీసుకుంటారు, సో ఇలాంటి వారు కాస్త జాగ్రత్త. ఉదయం టిఫిన్ మానేసి పండ్లు తీసుకోకండి, ముఖ్యంగా ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది.
ఖాళీ కడుపుతో పండ్లు తినడం వలన కలిగే నష్టాలు చాలా ఉన్నాయి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అరటిపండు వద్దు, కడుపులో అసౌకర్యంగా ఉంటుంది, ఇక సలాడ్ కూడా వద్దు, దీని వల్ల నెమ్మదిగా గ్యాస్ ఫామ్ అవుతుంది, ఉదయమే సిట్రిస్ ఉండే నారింజ, , కివీ వంటి సిట్రల్ జాతి పండ్లను తీసుకోవద్దు.
ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినడం వలన గ్యాస్ట్రిక్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తుంటాయి. చపాతిలు, పూరిలు, జొన్న, రాగి లేదా సజ్జలతో చేసిన వాటిని తీసుకువడం మంచిది. ఇక ఉడికించిన ముక్కలు లాంటివి తీసుకున్నా మంచిది.. పీచు పదార్దాలు ఉండే కూరలు తీసుకోండి. ఉదయం టిఫిన్ మాత్రం కచ్చితంగా తీసుకోండి.