షాకింగ్ న్యూస్ : కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు మరోసారి ఝలక్

0
107

కోవిడ్ వైరస్ నుంచి రక్షణ పొందేందుకు దేశీయంగా తయారైన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు మరోసారి ఝలక్ తగిలింది. భారత్ బయోటెక్ సంస్థ ఈ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కోవాగ్జిన్ టీకాకు పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అంగీకరించలేదు. వ్యాక్సిన్ కు మరింతగా క్లినికల్ ట్రయల్స్ డేటా కావాలని డిసిజిఐ తాజాగా భారత్ బయోటెక్ కు సూచించినట్లు తెలిసింది. పరిస్థితులను బట్టి చూస్తే కోవాగ్జిన్ కు ఫుల్ లైసెన్స్ రావడానికి మరో ఏడాది కాలం పట్టే అవకాశం ఉన్నట్లు కనబడుతున్నది. ఈ వ్యాక్సిన్ విషయంలో డిసిజిఐ మరో కీలకమైన సూచన చేసింది. అదేమంటే.. గర్భిణీలకు ఈ వ్యాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని సూచించింది.

ఇప్పుడు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్ ను వినియోగిస్తున్నారు. తాజాగా 77.8 శాతం సమర్థత ఉందంటూ డిసిజిఐ కి కోవాగ్జిన్ సమాచారాన్ని చేరవేసింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన భారత్ బయోటెక్ సంస్థ తన డేటాను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి కోసం పంపిన విషయం తెలిసేం. ఈ విషయంపై ఇప్పటి వరకు భారత్ బయోటెక్ స్పందించలేదు. ఇప్పటికే అమెరికాలో కోవాగ్జిన్ సరఫరాకు యూఎప్ఎఫ్డిఎ అంగీకరించని  విషయం విధితమే.

ఎటు చూసినా.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ పరిస్థితి ఇప్పట్లో అంత ఆశాజనకంగా లేదని తేలింది.