ఏపీలో తగ్గిన కరోనా విజృంభణ..హెల్త్ బులెటిన్ రిలీజ్..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

Decreased corona boom in AP..Health Bulletin Release

0
155

ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 26,393 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 1345 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 14,657 మంది క‌రోనా కాటుకు బ‌లైయ్యారు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,576 మంది క‌రోనా మహ‌మ్మారి నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  51

చిత్తూరు         83

ఈస్ట్ గోదావరి   309

గుంటూరు  132

వైస్సార్ కడప  56

కృష్ణ   184

కర్నూల్  62

నెల్లూరు   58

ప్రకాశం    87

శ్రీకాకుళం 22

విశాఖపట్నం  110

విజయనగరం 16

వెస్ట్ గోదావరి   175