ఇండియాలో తగ్గిన కరోనా విజృంభణ..గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

Decreased corona boom in India

0
100

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి. అయితే..నిన్న ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం బాగా తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 14148 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,81,179 కు చేరింది.

ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,48,359 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.82 శాతం గా ఉంది.  24 గంటల వ్యవధిలో 302 మంది మరణించారు. 30,009 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.22శాతానికి పరిమితమైంది. మృతుల సంఖ్య 5,12,924 కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,76,52,31,385 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

మొత్తం మరణాలు: 5,12,924

యాక్టివ్ కేసులు: 1,48,359

మొత్తం కోలుకున్నవారు: 4,22,19,896

దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. బధవారం మరో 30,49,988 టీకా డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,76,52,31,385కు చేరింది.