ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి..కొత్త కేసులు ఎన్ని నమోదయ్యాయంటే?

0
47

ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 18803 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 244 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 14,716 మంది క‌రోనా కాటుకు బ‌లైయ్యారు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 662 మంది క‌రోనా మహ‌మ్మారి నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  18

చిత్తూరు         8

ఈస్ట్ గోదావరి   47

గుంటూరు  33

వైస్సార్ కడప  14

కృష్ణ   42

కర్నూల్  3

నెల్లూరు   13

ప్రకాశం    17

శ్రీకాకుళం 3

విశాఖపట్నం  18

విజయనగరం 2

వెస్ట్ గోదావరి   26