ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి..ఆ 4 జిల్లాల్లో ఒక్కరోజే వెయ్యికి పైగా కేసులు నమోదు!

Decreased corona calm in AP..more than a thousand cases registered in those 4 districts in one day!

0
82

ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 39296 శాంపిల్స్ పరీక్షించగా 10,310 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో 12 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,031 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 9,692 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,24,45,428 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  99

చిత్తూరు         411

ఈస్ట్ గోదావరి   910

గుంటూరు  1249

వైస్సార్ కడప  1697

కృష్ణ   1008

కర్నూల్  1379

నెల్లూరు   927

ప్రకాశం    700

శ్రీకాకుళం 229

విశాఖపట్నం  853

విజయనగరం 222

వెస్ట్ గోదావరి   626