భారత్ లో తగ్గిన కరోనా ఉధృతి..హెల్త్ బులెటిన్ రిలీజ్..కొత్త కేసులు ఎన్నంటే?

Decreased corona calm in India

0
113

భారత్ లో కరోనా విజృంభణ తగ్గింది. గత 15 రోజుల నుంచి లెక్కలు చూస్తే ఈ మహమ్మారి ఉధృతి గురించి తెలుస్తుంది. అయితే..నిన్న ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు ఆందోళన కలిగించగా..ఇవాళ కేసుల సంఖ్య బాగా తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 8023 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,24,140 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,02,611 కు చేరింది. ఇక దేశంలో తాజాగా 119 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,13,843 కి చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.62 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,77,50,86,335 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 4,90,321 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16765 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,23,07,686 కు చేరింది.