భారత్ లో తగ్గిన కరోనా ఉధృతి..హెల్త్ బులెటిన్ రిలీజ్..కొత్త కేసులు ఎన్నంటే?

Decreased corona calm in India..Health Bulletin Release

0
95

గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మొదటి వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మన దేశంలో కరోనా మహమ్మారి పీడ మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంది. ఇండియాలో థర్డ్ వేవ్‌ పూర్తిగా తగ్గిపోయింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 6561 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,45,160 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 77,152 కు చేరింది. ఇక దేశంలో తాజాగా 142 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,14,388 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,23,53,620 కు చేరింది.

ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.92 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,78,02,63,222 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 21,83,976 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది.

 

మొత్తం కేసులు: 42,938,599

మొత్తం మరణాలు: 5,14,388

యాక్టివ్​ కేసులు: 77,152

కోలుకున్నవారు: 4,23,53,620