ఇండియాలో తగ్గిన కరోనా కేసులు..కలవరపెడుతున్న మరణాలు

0
99

దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య అదుపులోకి వస్తున్నాయి. రోజూవారీ కేసుల సంఖ్య 2 లక్షల దిగువకు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఇండియాలో కరోనా ప్రభావం చూపించింది.

ఇటీవల కాలంలో రోజూవారీ కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా కేసులు సంఖ్య తగ్గినా.. మరణాల సంఖ్య పెరగడం కలవరపరుస్తోంది. భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,61,386 కొత్త కేసులు నమోదయ్యాయి.

మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. గత 24 గంటల్లో భారతదేశంలో 1,733 మరణాలు నమోదయ్యాయి.  2,81,109 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 9.2 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం మరణాలు: 4,97,975

యాక్టివ్ కేసులు: 16,21,603

మొత్తం కోలుకున్నవారు: 3,95,11,307