డెలివరీ టైమ్లో సిజేరియన్ చేశారా? ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రికవరీ అవుతారు

డెలివరీ టైమ్లో సిజేరియన్ చేశారా? ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రికవరీ అవుతారు

0
93

డెలివరీ టైమ్లో సిజేరియన్ చాలా మందికి జరుగుతూ ఉంటుంది.. నార్మల్ డెలివరీల కంటే ఇప్పుడు సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి, అయితే ఈ సమయంలో వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెబుతారు అవి పాటించాలి, అయితే వైద్య నిపుణులు చెబుతున్న కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం వీటి వల్ల మీకు ఏ సమస్యలు రావు.

ముందుగా మీకు ఇలా సీసెక్షన్ జరిగితే ఆరు వారాలు పడుతుంది కోలుకోవడానికి, ఎలాంటి బరువు పనులు చేయవద్దు, అతిగా నీటిలో తడవకూడదు, చల్లనీరు ముట్టుకోవద్దు,చెవులలోకి గాలి వెళ్లకుండా చూసుకోవాలి చల్లటి గాలి, అలాగే మసాలా దినుసులు ఆహరం తినవద్దు.

మీకు ఆపరేషన్ చేస్తే మూడో వారం నుంచి ఆనొప్పి కాస్త తగ్గుముఖం పడుతుంది,
మీకు డాక్టర్ చెప్పిన తర్వాత మీరు నడక మొదలు పెట్టండి ఇది రికవరీకి చాలా మంచిది
ఆపరేషన్ చేసిన చోట తడిగా ఉంచవద్దు పొడిగా ఉండాలి
ఇన్పెక్షన్ అక్కడ సోకినట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి, వేడి జ్వరం ఉన్నా అశ్రద్ద చేయవద్దు
బిడ్డ పడుకున్న సమయంలో మీరు పడుకుంటే మంచిది
రాత్రి నిద్రలేకపోవడం వల్ల మరింత నీరసం ఉంటుంది అందుకే ఇద్దరూ ఒకేసారి పడుకుని పెద్దలని చూడమని చెప్పండి
నీరు ఎక్కువగా తాగండి, సమతుల ఆహారం తీసుకోండి

# ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి#