భారత్ లో ‘డెల్మిక్రాన్’ రకం కరోనా..తస్మాత్ జాగ్రత్త!

'Delmicron' type corona in India..Tasmat caution!

0
81

ప్రపంచంలో ఒమిక్రాన్ వైరస్ రోజురోజుకు గణనీయంగా విస్తరిస్తుంది. ఒక్క అమెరికాలోనే ఉన్న మొత్తం కేసుల్లో 73% కేసులు ఒమిక్రాన్ వే అని అధికారికంగా ప్రకటించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.

అయితే ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ డెల్టా వేరియంట్ తో పోలిస్తే 5 రేట్లు వేగంగా విస్తరిస్తుంది. ఈ వైరస్ కేవలం 1-3 రోజుల్లోనే డబుల్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. అయితే ఇప్పటివరకు మనదేశంలో డెల్టా వేరియంట్ డామినెంట్ గా ఉంది. ఒమిక్రాన్ డామినెంట్ వేరియంట్ గా మారలేదు. అందుకే దీనిని శాస్త్రవేత్తలు డెల్మిక్రాన్ వేరియంట్ అంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో డెల్టా వేరియంట్ ఉంది. అలాగే ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఉంది.

అలాగే ఇప్పటివరకు మన దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో 183 కేసులపై స్టడీ చేయగా సంచలన విషయాలు తెలిశాయి. 183 మందిలో సగం మంది రెండు డోసులు తీసుకున్నవారే కావడం గమనార్హం. డెల్టాతో పోలిస్తే ఈ ఒమిక్రాన్ వైరస్ రెండు డోసులు తీసుకున్నవారికి, కరోనా వచ్చిన వారికి రావడానికి 3 రెట్లు అవకాశం ఉంది.

అలాగే ఒమిక్రాన్ కేసులు నమోదు అయిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఐసీయూలో ఉంచడం, వెంటిలేటర్ సాయం, మరణాలు వంటివి సంభవించలేదు. అలాగే వీరిలో చాలా మంది ఇప్పటికే వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఎంత ఎక్కువుందో తీవ్రత మాత్రం అంతగా లేదు. అలాగే వాక్సినేషన్ శాతం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.