కరోనా సెకండ్ వేవ్ భారత్ పై ఎంత ప్రభావం చూపించిందో మనం చూశాం. ఇక థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉంది అంటున్నారు నిపుణులు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు. మళ్లీ పెద్ద ఎత్తున ఫంక్షన్లు, గేదరింగ్ లు అయితే వైరస్ విజృంభించే ప్రమాదం ఉంటుంది అంటున్నారు.
ఈ సెకండ్ వేవ్ లో కరోనా నుండి మ్యుటేట్ అయిన డెల్టా వేరియంట్ మరింత ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పుడు డెల్టా వేరియంట్ మరోసారి మ్యుటేట్ అయి డెల్టా ప్లస్ గా మారింది. ఇప్పటికే ఇది భారత్ తో సహా 9 దేశాలలో విస్తరించింది.
ఈ డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ భారత్ లో కోవిడ్ మూడో దశకి ప్రధాన కారణం అయ్యే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు. మన దేశంలో నాలుగు రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఈ వేరియంట్ విస్తరించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.అంతేకాదు మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు 21 డెల్టాప్లస్ కేసులను గుర్తించారు.