తెలంగాణలో కరోనా ఫోర్త్ వేవ్ పై డీహెచ్ కీలక వ్యాఖ్యలు

0
77

తెలంగాణలో ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశం లేదని వైద్య ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది. కానీ అందరు కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పండుగలు, ఫంక్షన్లలో  శానిటైజర్లు, మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని డీహెచ్‌ శ్రీనివాస్ రావు తెలిపారు.

కానీ మరో 6 వారాల పాటు కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు 3 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కొత్త వేరియంట్‌ వస్తేనే రోజు వారీ కేసులు అధికంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఫోర్త్‌వేవ్‌ రాదనే కారణంతో కోవిడ్ నిబంధనలు ఉల్లగించకూడదని ఆయన తెలిపారు.