తిరుమల తిరుపతి దేవస్థానంలో ధన ప్రసాదం – ఇది ఏమిటంటే

Dhana Prasadam at the Tirumala Tirupati Temple

0
87

తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త కార్యక్రమం తీసుకువచ్చారు. శ్రీవారికి నిత్యం భక్తులు కానుకల రూపంలో నగదు సమర్పించుకుంటారు. అక్కడ హుండీల్లో ఈ నగదు వేస్తారు. అయితే తాజాగా ఇలా కానుకల రూపంలో వచ్చే చిల్లర నాణాలను ధన ప్రసాదం రూపంలో భక్తులకే ఇవ్వాలని నిర్ణయించింది తితిదే.. రూ. 10 నుంచి 20 లక్షల వరకు చిల్లర నాణేలు నిత్యం స్వామివారి హుండీలో వస్తూ ఉంటాయి.

ఇక ఈ చిల్లర అనేది తీసుకోవడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీంతో చిల్లర నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. అందుకే టీటీడీ ధన ప్రసాదం కార్యాక్రమాన్ని తీసుకొచ్చింది. తిరుమలలో అతిథి గృహాల రిసెప్షన్ కేంద్రాల దగ్గర ధన ప్రసాదం రూపంలో నాణేలను 100 రూపాయల ప్యాకెట్ల రూపంలో కవర్లలో అందిస్తోంది.

అయితే ఇది ఏ విధంగా ఇస్తారు అనేది చూస్తే .అకామిడేషన్ బుకింగ్ సమయంలో చెల్లించిన క్యాష్ డిపాజిట్ ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో తిరిగి చెల్లించేలా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒకవేళ భక్తులు ఇలా చిల్లర రూపంలో తీసుకోకపోతే నోట్లు ఇస్తారు. ముందు రూపాయి నాణాలు ఇస్తున్నారు, తర్వాత రెండు ఐదు రూపాయల నాణాలు కూడా ఇవ్వనున్నారు.