డయేరియా లేదా లూజ్ మోషన్స్ విరోచనాలు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇలా బాత్రూమ్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది.. కొన్ని ఆహారాలు తిన్న తర్వాత కూడా కొందరికి మోషన్స్ ఇబ్బంది పెడతాయి.
విరోచనాల సమయంలో శరీరం లో నుండి నీరు కూడా ఎక్కువ బయటకు పోతుంది, ఫలితం గా డీహైడ్రేషన్ కి గురి అవ్వచ్చు.
అయితే కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే ఈ ఇబ్బంది తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. అయితే అందరికి ఈ ఫుడ్ పడకపోవచ్చు కొందరికి పడుతుంది, మరి ఇలా మోషన్స్ సమయంలో ఈ ఫుడ్ తీసుకోవచ్చు.. పెరుగు మజ్జిగ అరటిపండు
కొబ్బరి నీరు.
ఏం తీసుకోకూడదు అనేది చూద్దాం..
పాలు, పన్నీర్, చీజ్, బటర్ , ఫాస్ట్ ఫుడ్, న్యూడిల్స్, బిర్యానీ చికెన్ మటన్ చేపలు
షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దు
కాఫీ, టీ కూడా వద్దు
వేపుళ్ళు క్రీం ఉన్న ఫుడ్స్
పండ్ల రసాలు పంచదార కలిపినవి
ఉల్లిపాయ
ఆల్కహాల్
స్పైసీ ఫుడ్, మసాలాలు
ఇలాంటి వాటికి దూరంగా ఉండండి