గ్వారానా పండు ఇది చూడటానికి చాలా ఎర్రగా ఉంటుంది. లోపల తెల్లగా నల్లగా ఉంటుంది.
దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో పాకుతూ వెళ్లే గ్వారానా మొక్కలకు కాస్తాయి ఈపండ్లు. ఇవి బరువుని తగ్గిస్తాయి.లైంగిక పటుత్వాన్ని పెంచే అద్భుత ఔషధ గుణాలు ఈ పండ్లలో ఉన్నాయి.
తలనొప్పి, ఫీవర్, కాలిన గాయాల్ని నయం చేస్తాయట.
పలు మెడిసన్స్ కి కూడా వీటిని ఎక్కువగా వాడతారు. గ్వారానాతో ఎనర్జీ కూల్ డ్రింక్ కూడా తయారుచేస్తారు. అలాగే ఈ పండ్ల నుంచీ గ్వారానా పౌడర్ తయారు చేస్తారు.
ఇందులో కెఫైన్ కూడా ఉంటుంది. వీటిని ఎక్కువగా సాఫ్ట్ ఎనర్జీ డ్రింక్స్ తయారుచేస్తున్నారు.
కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో వీటిని వాడుతున్నారు.
ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దాదాపు 30 శాతం మెడికల్ కంపెనీలు ముందుగానే వీటిని కొనుగోలు చేస్తాయి.ఈ పండ్లకు మెడిసిన్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే అమెజాన్ లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి.