సురక్షిత శృంగారం చేయాలి అని అనుకునేవారు ఎక్కువగా వాడేది కండోమ్, అయితే అబ్బాయిలు కండోమ్ వాడతారు అని తెలుసు, కాని ఈ మధ్య అమ్మాయిలకి కూడా సరికొత్త కండోమ్స్ మార్కెట్లో వచ్చాయి, సరైన థ్రిల్ ఇద్దరూ అనుభవించేలా ఈ కండోమ్స్ తయారు అయ్యాయి, ఇక ఎయిడ్స్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అంటూ ప్రచారం జరిగింది.
ఇవి మేల్ కండోమ్స్ కంటే చాలా పలుచగా ఉంటాయి. మేల్ కండోమ్లోని లేటెక్స్ మెటీరియల్ పడనివాళ్లు వీటిని వాడి చూడవచ్చు. సరిగ్గా వాడితే ఫెయిల్యూర్ రేటు తగ్గుతుంది. అయితే వీటివల్ల సుఖవ్యాధులను, అవాంఛిత గర్భాలను చాలా మేరకు నివారించవచ్చు. ఇక మేల్ కండోమ్స్ కంటే ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఐదు రెట్లు ఎక్కువ ఉంటుంది.
ఇటీవల కాలంలో ఫిమేల్ కండోమ్స్ వాడకం పెరిగినట్టుగా తెలుస్తోంది. ఉత్తర అమెరికా -మెక్సికో జర్మనీ, ఫ్రాన్స్, , రష్యా, ఇటలీ చైనా, జపాన్, కొరియా, ఇండియా, నైరుతి ఆసియా, ఆస్ట్రేలియా బ్రెజిల్,లో వీటి అమ్మకాలు పెరుగుతున్నాయి, ఈ కరోనా సమయంలో 65 శాతం వీటి అమ్మకాలు పెరిగాయట,