పింక్ సాల్ట్ గురించి మీకు తెలుసా

Did you know about Pink Salt

0
92

పింక్ సాల్ట్ ఇది చాలా తక్కువ మందికి తెలిసిన సాల్ట్. అయితే ఈ ఆన్ లైన్ గ్రోస‌రీ పోర్టల్స్ ద్వారా చాలా మంది వీటిని ఇప్పుడు కొంటున్నారు. ఈ ఉప్పులో ఏకంగా 84 రకాల పోషకాలు ఉన్నాయట. ఇక మాములు ఉప్పు చూసుకుంటే కిలో రూ.20 నుంచి రూ.30 ధ‌ర ఉంటుంది. కాని దీని ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.

గులాబీ రంగురాతి ఉప్పులా ఉండే ఈ ఉప్పును హిమాలయాల్లోని రాతి స్పటికాలతో తయారు చేస్తారు. ఇండియాతోపాటు పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లోనూ ఈ ఉప్పును ఉత్పత్తి చేస్తున్నారు.
ఇక మరో స్పెషాలిటి చెప్పాలి అంటే మాములు ఉప్పులో కంటే ఇందులో సహజంగానే అయోడిన్ ఉంటుంది.

మరి ఇది ఎందుకు పింక్ కలర్ ఉంది అంటే ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ ఉప్పు పింక్ కలర్లో ఉంటుంది. ఈ పింక్ సాల్ట్ లో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ ఉంటాయి. ఇక మాములు ఉప్పు కంటే ఇది మంచిది అని నిపుణులు చెబుతున్నారు.