గ్యాస్ సిలిండర్‌కు కూడా ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుందని తెలుసా? ఎలా గుర్తించాలంటే..పూర్తి వివరాలిలా..

Did you know that a gas cylinder also has an expiration date?

0
97

వంట గ్యాస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే చిన్న తప్పుకి ప్రాణాలు పోయే పరిస్థితి లేదు. చాలా మందికి అసలు వంట గ్యాస్ సిలిండర్ నిర్వహణ, సిలిండర్‌కు సంబంధించిన కొన్ని విషయాలు అసలే తెలియవు. దానితో ప్రమాదాలు సంభవించవచ్చు. మరి గ్యాస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎక్స్ పయిరీ గడువు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ప్రతీ వంట గ్యాస్ సిలిండర్ పై ఎక్స్ పయిరీ తేదీ ఉంటుందన్న విషయం తెలిసిన వారు అతి కొద్ది మందే. ఈ గడువు దాటిన తర్వాత మీ ఇంటికి చేరే సిలిండర్లలో లీకేజీలు ఏర్పడవచ్చు. ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిజానికి వంటగ్యాస్‌పై ఎక్స్ పయిరీ తేదీ విషయం పౌర సరఫరాల శాఖ అధికారుల్లోనూ అందరికీ తెలియదు. ప్రతీ సిలిండర్ పై భాగంలో పట్టుకునేందుకు గుండ్రటి హ్యాండిల్ వలే ఉంటుంది. దానికి సిలిండర్‌కు సపోర్టెడ్‌గా మూడు ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లపై లోపలి వైపు అంకెలు వేసి ఉండడాన్ని గమనించవచ్చు. ఈ మూడింటిలో ఒక దానిపై ఆ సిలిండర్ ఎక్స్ పయిరీ తేదీ కూడా ఉంటుంది. దీనిపై సంవత్సరం, నెల వివరాలు ఉంటాయి.

సిలిండర్ పై ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్ పై A 22 అని ఉందనుకోండి. కచ్చితంగా అదే ఎక్స్ పయిరీ తేదీ. A 22 అంటే జనవరి నుంచి మార్చి, 2022వరకు అని అర్థం. సిలిండర్ ఆ సంవత్సరం మొదటి త్రైమాసికం చివరితో గడువు తీరిపోతుందని అర్థం. మార్చి తర్వాత తిరిగి పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాతే పంపిణీకి రావాల్సి ఉంటుంది. B అంటే ఏప్రిల్ – జూన్ అని C – అంటే జూలై – సెప్టెంబర్ వరకు అని, D -అంటే అక్టోబర్ – డిసెంబర్ వరకు అని అర్థం.

కస్టమర్లలో అవగాహన తక్కువే కనుక గ్యాస్ కంపెనీలు గడువు తీరిన వెంటనే అన్ని సిలిండర్లను విధిగా పరీక్షలకు పంపడం అనేది ఎంతో ముఖ్యం. కొన్ని అలా పంపడం లేదనే వాదన ఉంది. వెసులుబాటును బట్టి పంపిస్తుంటారు. అవగాహన పెరిగి ప్రశ్నించడం ఎక్కువైతే అప్పుడు గడువు దాటిన సిలిండర్లను మార్కెట్లోకి పంపించేందుకు గ్యాస్ కంపెనీలు సాహసం చేయలేవు. ప్రస్తుతం అవగాహన తక్కువే కనుక ఇలా చేసే అవకాశం ఉంటుంది.

ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత పైన సీల్ ను చెక్ చేసుకోవాలి. సేఫ్టీ క్యాప్‌కు ఎటువంటి క్రాక్స్ ఉండరాదని నిబంధనలు చెబుతున్నాయి. క్యాప్ తెరచి లీకేజీ ఉందేమో పరీక్షించాలి. వేలితో వాల్వ్ ను మూసి ఉంచినట్టయితే.. లీకేజీ ఉంటే లీక్ అయిన గ్యాస్ వేలిని పైకి నెడుతుంది. లీకేజీ ఉంటే కనుక ఆ సిలిండర్ ను తీసుకోవద్దు. అలాగే, గడువు దాటిన సిలిండర్‌ను కూడా తీసుకోవద్దు.