నేరేడులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

0
99

వేసవిలో లభించే పండ్లలో నేరేడు ఒకటి. నేరేడు మాములుగా పల్లెటూరులో అధికంగా లభిస్తాయి. ఇవి మంచి రుచి కలిగి ఉంటాయి. అంతేకాకుండా మార్కెట్ లో నల్ల నేరేడు పండ్ల కు భలే గిరాకీ ఉంటుంది. అలాగే దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నేరేడు పండులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి, బి6 ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. అలాగే మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతుంటే నేరేడుపండులోని ఆస్ట్రింజెంట్ గుణం చర్మంపై ఏర్పడే మొటిమల సమస్యను తగ్గించడానికి తోడ్పడుతుంది.

అంతేకాకుండా.. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని శుద్దిచేయడమే కాకుండా హిమోగ్లోబిన్ ను అన్ని శరీర భాగాలకు ఆక్సిజన్ అందేలా సహాయపడుతుంది. నేరేడుపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం, రక్తంలోని టాక్సిన్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే వృద్ధాప సమస్యలను తగ్గిస్తుంది.నేరేడు పండు గింజలను ఆయుర్వేదంలో పలు చికిత్సలకు కూడా ఉపయోగిస్తారు. చిగుళ్లకు,దంతాలకు నేరేడు పండ్లు అద్భుతంగా పనిచేస్తుంది.

అందుకే ప్రతి సీజన్ లో నేరేడు తినడానికి ఆసక్తి చూపండి.. మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.