రావణుడ్ని సంహరించిన తర్వాత ఆ శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు వచ్చారు. ఇక పెద్దలు పండితులు మంచి ముహూర్తం చూసి ఆయనకు పట్టాభిషేకం చేశారు. ఓరోజు సభలో రాముడు ఉన్న సమయంలో యుద్దానికి సంబంధించి అందరూ మాట్లాడుకున్నారు.14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు అని చర్చించుకున్నారు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు.
లక్ష్మణుడు భార్య ఊర్మిళాదేవి ఆమె కూడా జనక మహారాజు కూతురు. సీతాదేవిని రాముడికి ఇచ్చి వివాహం చేశారు. ఇక సీతకి చెల్లెలు ఊర్మిల. ఆమెని లక్ష్మణుడికిచ్చి వివాహం చేశారు. శ్రీరాముడు, సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు అతనితోపాటు ఊర్మిల కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధం అయింది. కానీ లక్ష్మణుడు మాత్రం ఆమెని అయోధ్యలోనే ఉండాలి అని తల్లిదండ్రులని చూసుకోమని చెప్పాడు.
అయితే తన అన్న వదినల కోసం అరణ్యంలో లక్ష్మణుడు ఎంతో సేవ చేశాడు. రాత్రి వేళల్లో అడవిలో అన్న వదినలకు రక్షణగా ఉన్నాడు. ఈ సమయంలో 14 ఏళ్లు తనకు నిద్ర రాకూడదు అని నిద్ర దేవతని కోరాడు. కాని ఇది ప్రకృతి ధర్మం అని చెబుతుంది ఆమె. ఈ నిద్రను ఎవరికైనా పంచాలని కోరడంతో తన పద్నాలుగేళ్ళ నిద్రను తన భార్య ఊర్మిళకు ఇస్తాడు.
ఈ 14 ఏళ్లను ఊర్మిళదేవి నిద్రగా పిలుస్తారు.రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో లక్ష్మణుడు,ఊర్మిళ ఆలయం ఉంది. క్రీ.శ. 1870లో అప్పటి భరత్పూర్ పాలకుడు బల్వంత్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారు.