టీలో బిస్కెట్లు ముంచుకొని తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

0
99

ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరు టీలో బిస్కెట్లు ముంచుకొని తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ అలా తినడం చాలా సమస్యలు తలెత్తుతాగాయి. అంతేకాకుండా జీవితాంతం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే అవేంటో మీరు కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి..

బిస్కెట్లలో చక్కెర అధికంగా ఉండడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బ తినే అవకాశం ఉంది. అంతేకాకుండా దంతాలు పుచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీలయినంత వరకు వీటికి దూరంగా ఉండడమే మంచిది. ఇలా తినడం వల్ల మలబద్ధకం సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చాలాకాలం బిస్కెట్లు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, థైరాయిడ్ సమస్య ఉన్నవారు బిస్కెట్లను తింటే  ప్రమాదాన్ని కొని తెచుకున్నట్టే అని నిపుణులు చెబుతున్నారు. చాలామంది బిస్కెట్లను చాలాసేపు టీలో నాబెట్టుకొని తింటుంటారు. దీనివల్ల ఊబకాయం సమస్యతో పాటు చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.