Big Breaking: తెలంగాణలో కలకలం..2 ఒమిక్రాన్ కేసులు గుర్తింపు

0
90

ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరగడం కలవరపెడుతుంది. ఇప్పటికే ఏపీలో ఒమిక్రాన్ కేసు నమోదు కాగా తాజాగా తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపింది. హైదరాబాద్ లో 2 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్లిన మరో ప్రయాణికుడికీ ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. ప్రయాణికుడు వెళ్లిపోయిన తర్వాత ఒమిక్రాన్‌గా గుర్తించారు వైద్యులు. తెలంగాణలో ప్రస్తుతానికి రెండు యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇదే విషయాన్ని ధృవీకరించారు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్. దీంతో అన్ని జిల్లాల వైద్యాధికారులను ప్రభుత్వం అలెర్ట్ చేసింది.