జామపండు ఈ వ్యాధులు ఉంటే తినకండి దూరంగా ఉండండి

Do not eat guava if you have these diseases

0
79

అరటి పండు తర్వాత ఎక్కువగా తినేది జామకాయనే . షుగర్ పేషెంట్లు కూడా బాగా పండని కాయ తింటారు. అయితే కొన్ని వ్యాధులు శరీర ఇబ్బందులు ఉన్న వారు ఈ జామకాయ తినకపోవడం మేలు అంటున్నారు నిపుణులు. జామకాయలో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది.

జామ ఆకులను కొందరు తింటారు, కషాయాలు చేసుకుంటారు, అయితే జామలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. మరి ఎవరు ఈ జామ తినకూడదు అంటే గ్యాస్ సమస్య ఉన్న వారు జామకు దూరంగా ఉండాలి ఇది ఎక్కువ తీసుకుంటే వారికి కడుపు నొప్పి ఉబ్బరం సమస్య వస్తుంది

ప్రేగు సిండ్రోమ్తో బాధపడుతుంటే తినవద్దు. మలబద్దకం ఇది పోగొడుతుంది అయితే ఎక్కువగా తీసుకుంటే మీ జీర్ణవ్యవస్ధ దెబ్బతింటుంది అందుకే ఈ ఇబ్బందితో బాధపడుతుంటే జామ తీసుకోవద్దు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాని ఈ పండులో చక్కెర ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే షుగర్ స్థాయి పెరుగుతుంది. అందుకే ఏ వారానికి ఓసారి మాత్రమే తీసుకోవాలి
రాత్రి జామ అస్సలు తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.