సీజన్ బట్టీ అనేక ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి… ముఖ్యంగా సమ్మర్ వచ్చింది అంటే మామిడిపండ్లు వస్తాయి.. ముఖ్యంగా
మామిడి ఈ నాలుగు నెలలు ఎక్కువగా వస్తుంది…ఇక మార్కెట్లో అనేక రకాల మామిడి పండ్లు వస్తాయి, ఇక మార్చి నెలలో చాలా వరకూ మామిడి అమ్ముడు అవుతోంది.. మామిడిలో బాగా పేరొందిన రకాలు చూస్తే బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, గోవా, కీసర, లంగ్డా వంటి వందకుపైగా రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి.
ఒక్కొక్కటి ఒక్కో రేటు ఉంటుంది.. పరక డజను ఒక్కో రేటుకి అమ్ముతూ ఉంటారు.. కొందరు వ్యాపారులు కిలోల లెక్కన అమ్ముతూ ఉంటారు.. పిండి పదార్థాలు, చక్కెర్లు, పీచు పదార్థాలు, వివిధ విటమిన్లు, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, జింక్
ఇవన్నీ పుష్కలంగా ఇందులో ఉంటాయి.
అయితే ఇవి త్వరగా పండటానికి కొందరు అనేక రకాలా మందులు వాడుతున్నారు.కార్బైడ్ వంటి రసాయనాలు వాడుతున్నారు. ఇలాంటి పళ్లను తింటే ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.సహజ పద్ధతుల్లో మగ్గబెట్టకుండా ఇలా కృత్రిమంగా మందులు కార్బైట్ పెడితే దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
అమ్మాయిలకి గర్భధారణ అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు వైద్యులు.
|
|
మామిడి పండ్లు ఇలాంటివి తినకండి చాలా డేంజర్
-