వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలతో వ్యాధులు మన దరి చేరకుండా చెక్ పెట్టొచ్చు. చాలా మంది వానాకాలంలో జలుబు, దగ్గు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్దులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా వర్షాకాలంలో ప్రధాన సమస్య దోమలు. ఇవి మనకు లేనిపోని రోగాలను తెచ్చి పెడతాయి. దోమ తెరలను వాడడం, నీరు నిల్వ ఉన్న చోట కిరోసిన్ పోస్తే దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు.
ఇక కలరా, టైఫాయిడ్ ఎక్కువగా మన అపరిశుభ్రత, అజాగ్రత్త వలన వస్తుంది. వీటిని కాచి వడబోసిన నీటిని త్రాగటం, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా అరికట్టవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహరం పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.