నాన్ వెజ్ ఇష్టంగా తినేవారు ముందు ప్రయారిటీ చికెన్ మటన్ ఫ్రాన్స్ కు ఇస్తారు.. మరికొందరు చికెన్ తర్వాత ఫిష్ కు ఇంపార్టెన్స్ ఇస్తారు… అయితే వారానికి రెండు రోజులు చేప తినేవారు ఎందరో ఉన్నారు.. ముఖ్యంగా అనేక రకాల చేపలు మార్కెట్లో ఉంటాయి కాబట్టి.. ఒక్కోవారం ఒక్కో రకం చేప రుచిని చూస్తు ఉంటారు, ఇక పులస గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అయితే చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు.
చేపలను ఆహారంలో తీసుకునే వారు గుండె జబ్బులకు దూరంగా ఉంటారని చెబుతున్నారు.. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఈ వ్యాధులను నిరోధిస్తాయని తెలిపారు. కొవ్వు, నూనెలు ఎక్కువగా ఉండే చేపలను తీసుకుంటే మంచిది. అయితే అతిగా తిన్నా ప్రమాదమే కాబట్టి వారానికి ఓసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేపలు తినవచ్చు.
ఇక చాలా దేశాల్లో ఫిష్ తో అనేక రకాల వంటకాలు చేస్తారు.. కొందరు ఫ్రిజ్ లో నిల్వ చేస్తారు.. ఏది అయినా ఫిష్ వండిన తర్వాత 12 గంటల్లో దానిని తినడం మంచిది… ఫ్రిజ్ లో పెట్టుకుని రెండు మూడు రోజులు చేపల కూర తినడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.