బాదం టీ తాగుతున్నారా మిస్ కాకండి ఎన్నో లాభాలు

Do not miss the many benefits of drinking almond tea

0
85

బాదంపప్పు చాలా మంది తీసుకుంటారు ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. ఇక బాదం మిల్క్ కూడా చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు. అయితే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, జింక్ పోషకాలు ఉంటాయి. నానబెట్టిన బాదం చాలా మంది తీసుకుంటారు అయితే ఇక్కడ కొందరు బాదం టీని కూడా ఇష్టపడతారు ఈ ప్లేవర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.

సింపుల్ గా మనం బాదం టీ చేసుకోవచ్చు. బాదం పప్పులు రెండు గంటలు నానబెట్టాలి దానిని మళ్లీ హీట్ వాటర్ లో 15 నిమిషాలు నానబెట్టాలి . తర్వాత దానిని పేస్ట్ చేసుకోవాలి .ఈ పేస్ట్ని నీటిలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు మరిగించాలి. మీరు దీనిని వేడిగా లేదా చల్లగా కూడా తీసుకోవచ్చు.

ఈ టీ తాగడం వల్ల ముఖం పై ముడతలు మచ్చలు తగ్గుతాయి. ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ సమస్యలు ఉంటే బాదం టీ వల్ల ఉపశమనం దొరుకుతుంది. ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రావు, బరువు పెరగరు.