ఈ పండ్లు అస్సలు మిక్స్ చేసి తీసుకోవద్దు చాలా సమస్యలు వస్తాయి

Do not mix and eat these fruits at all

0
78

మనలో చాలా మంది అనేక రకాల పండ్లు కలిపి తీసుకుంటూ ఉంటారు. అయితే వైద్యులు కొన్ని రకాల ఫ్రూట్స్ ఇలా తీసుకోవద్దు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అన్ని రకాల ఫ్రూట్స్ ఇలా కలిసి తీసుకోవడం వల్ల కడుపులో అనేక సమస్యలు వస్తాయి. మరికొందరికి అలర్జీ కూడా వస్తుంది. ఏ ఆహారంతో ఏది తీసుకోకూడదు అనే విషయంపై క్లారిటీ ఉండాలి. పండ్లని తినేటప్పుడు ఇలా మిక్సయిన రకాలు తింటే అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది.

ముఖ్యంగా జామకామ, అరటిపండు ఇలా కలిపి మాత్రం తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనికి కారణం కూడా చెబుతున్నారు. జామ పండు తిన్న తర్వాత వెంటనే అరటి పండు తింటే కడుపులో తిప్పినట్లు అవుతుంది. తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గ్యాస్ సమస్యలు కడుపు ఉబ్బరం ఇలాంటి సమస్యలు వస్తాయి.

ఇక కొందరికి వాంతులు అయ్యేటట్లు అనిపిస్తుంది. ఇంకా మరీ ముఖ్యంగా బొప్పాయి పుచ్చకాయ కర్భూజా తీసుకున్న తర్వాత నిమ్మరసం తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు. మీరు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటే అందులో పాలను వేస్తే అందులో నిమ్మకాయ అస్సలు వేసుకోవద్దు. ఆరెంజ్ క్యారేట్ కూడా కలిపి తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.