వాస్తు ప్రకారం ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు

Do not place these objects here according to the vasthu

0
112

మనలో చాలా మంది అనేక విషయాల్లో నమ్మకాలు పెట్టుకుంటారు. తిదులు రాశులు జాతకాలు నక్షత్రాలు ఇలా అనేకం చూస్తారు. ఈ రోజు మంచిది ఆరోజు చెడ్డది ఇలా అనేకం చెబుతారు. కొంతమంది హేతువాదులు ఇవి మూఢనమ్మకాలని వాదిస్తూ ఉంటారు. మన దేశంలోనే కాదు ఇలాంటి నమ్మకాలు చైనా, జపాన్, కొరియా, వంటి అనేక దేశాల ప్రజలు
నమ్ముతారు.

వాస్తుని కూడా చాలా దేశాల్లో నమ్ముతారు. ఏ దేశంలోనైనా ఇళ్ల నిర్మాణంలో వాస్తు పద్దతిని ఆ దేశ సంప్రదాయాలకు అనుగుణంగా చూస్తారు. ఇంటిపై ఏదైనా చెడు దృష్టిపడితే వాస్తు దోషం ఉంది అని అంటారు.
తరచుగా ఇబ్బందులు తెలెత్తితే పండితులను ఆశ్రయిస్తారు. అయితే పండితులు కొన్ని విషయాలు చెబుతున్నారు.
ఇంటి మేడ మీద పాత ఇనుప సామాన్లు పెట్టవద్దు అంటున్నారు పండితులు .

కొందరు పాత చెక్కలు తలుపులు కిటికీలు మంచాలు పాత ఇనుప సామాన్లు ఇలాంటివి పనికిరావని ఇంటిపైన ఖాళీ ఉంటే
అక్కడ పెడతారు. వాస్తు ప్రకారం ఇలా పెట్టవద్దు అంటున్నారు పండితులు. ఇవి చెద పడితే ఆ ఇంటికి అసలు మంచిది కాదు అంటున్నారు. ఇలా మేడ మీద పాత సామాన్లు పెట్టడం మంచిది కాదని పండితులు అంటున్నారు. ఇంటి పైకప్పు సన్ సైడ్ లు దగ్గర పాతవి పనికి రాని సామాన్లని పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు.