కేసులు తగ్గుతున్నాయని మాస్క్ తీయకండి – నిపుణులు ఏం చెబుతున్నారంటే

Do not remove masks that corona cases are decreasing

0
111

దేశంలో కరోనా కేసులు తగ్గాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రెండో దశ ముప్పు ఉంటుంది అని ముందు నుంచి హెచ్చరించారు. చివరకు దేశంలో లక్షలాది మంది ఈ కరోనాతో ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని అంటున్నారు నిపుణులు .అక్టోబరు-నవంబరు మధ్య ఉద్ధృతంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇక కొత్త రకం వేరియంట్ ఏదైనా బయటపడితే దాని ఉదృతి ఉంటుందని లేకపోతే సాధారణంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుత వేరియంట్లకు భిన్నంగా, ఏదైనా ప్రమాదకర వేరియంట్ పుట్టుకొస్తే మాత్రం థర్డ్ వేవ్ తప్పదని,
శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనంలో తెలిపారు.

ప్రస్తుతానికైతే డెల్టా వేరియంట్కు మించిన వేరియంట్లు లేవని, ఒకవేళ వచ్చే నెలలో సెప్టెంబరులో అలాంటి వేరియంట్ ఏదైనా పుట్టుకొస్తే అక్టోబరు-నవంబరు మధ్య మూడో దశ తీవ్రంగా ఉంటుందని తెలిపారు. అయితే టీకా కచ్చితంగా అందరూ తీసుకోవాలి అని తెలిపారు. కేసులు తగ్గుతున్నాయని మాస్క్ తీయవద్దు అంటున్నారు నిపుణులు.