ఈ ఆహారం తీసుకున్న తర్వాత పాలు తీసుకోకూడదా ?

Do not take milk after taking this food

0
126

చాలా మంది చేపల కూర, ఫ్రై తిన్న తర్వాత పెరుగు మజ్జిగ పాలు ఇలాంటి డెయిరీ పదార్ధాలు తీసుకోరు. అంతేకాదు వెన్న నెయ్యి కూడా తీసుకోరు. దీని వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి అని వీటికి దూరంగా ఉంటారు. ఆయుర్వేదంలో దీని గురించి తెలియచేశారు.

చేపలు తిన్న వెంటనే ప్రతిరోజూ పాలు తీసుకుంటే కొందరిలో ల్యూకోడెర్మా అనే అనారోగ్య స్థితి రావచ్చట. ఇది ఏమిటి అంటే చర్మంపై తెల్లటి పాచెస్ కనిపిస్తాయి అని చెబుతున్నారు. అంతేకాదు ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందుకే రెండింటినీ కలిపి తీసుకోకపోవడమే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు చేపలు తిన్న తర్వాత పెరుగు కూడా వద్దు అని చెబుతున్నారు. దీని వల్ల చర్మ వ్యాధులు కొందరికి వచ్చే అవకాశం ఉందట.పాలతో నువ్వులు తీసుకోవడం కూడా ప్రమాదకరం. ఇక సిట్రస్ పండ్లు పాలు కూడా తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.