అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వైద్యులు కూడా అదే చెబుతారు. రోజుకి ఒక అరటి పండు తింటే ఎంతో మేలని. ముఖ్యంగా మలబద్దకం అజీర్తి సమస్యలు అనేవి రావు అంటారు . అయితే చాలా మంది సరైన సమయంలో అరటిపండు తీసుకోరు. అందుకే కొన్ని సమయాల్లో అరటి పండు వద్దు అంటారు. మరి అలాంటి సమయాలు ఏమిటో చూద్దాం.
మీరు ఉదయం మధ్నాహ్నం సాయంత్రం అరటి పండు తీసుకోవచ్చు. అంతేకాని రాత్రి పూట మాత్రం అరటి పండు వద్దు అంటున్నారు నిపుణులు.అరటిలో ఇనుము, ట్రిప్టోఫాన్, విటమిన్ బి 6, విటమిన్ బి అలాగే పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మంచిదే అయితే రాత్రిపూట తీసుకుంటే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
ఇక మరికొందరు ఇమ్యునిటి వస్తుంది అని జలుబు దగ్గు కఫం ఉన్నా ఈ అరటి తింటారు. కాని ఈ మూడు లక్షణాలు ఉంటే అరటిపండు తీసుకోవద్దు. ఇక చాలా మంది ఉపవాసం ఉన్నాం కదా అని రాత్రిపూట ఉపావాసం ఉండి ఖాళీ కడుపుతో ఉదయం ఈ అరటి పండు తింటారు. ఖాళీ కడుపుతో అస్సలు అరటి పండు తీసుకోవద్దు.