ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇవి అస్సలు తీసుకోవద్దు

Do not take these at all as breakfast in the morning

0
95

చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఈ మధ్య ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకుంటున్నారు. కాని వైద్యులు ఇలాంటి ఫుడ్ కి దూరంగా ఉండాలి అని చెబుతున్నారు. శరీరంలో కొవ్వు ఉండటం వల్ల అనేక వ్యాధులకు గురవుతారనే విషయం తెలిసిందే.
మనం తీసుకునే అల్పాహారం సరైనదిగా ఉండాలి అంటున్నారు వైద్యులు. ఇష్టం వచ్చినవి తింటే ఊబకాయం వస్తుంది.

కొన్ని అల్పాహారాలు మాత్రం అస్సలు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి అలాంటి ఫుడ్ ఏమిటి అనేది చూద్దాం.
వైట్ బ్రెడ్ ఇది ఉదయం పూట వద్దు అంటున్నారు వైద్యులు. దీని వల్ల బరువు పెరుగుతారు దీని కంటే బ్రౌన్ బ్రెడ్ మంచిది.
నూనె, సుగంధ ద్రవ్యాలు, నెయ్యి ఎక్కువగా ఉన్నవాటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవద్దు. చిప్స్, పాప్కార్న్ కి ఉదయం దూరంగా ఉండాలి.

కేకులు, కుకీలు ఇవన్నీ మైదాతో పాటు నెయ్యి క్రీమ్లు వేసి వేస్తారు. దీని వల్ల బరువు పెరుగుతారు. అందుకే ఉదయం పూట టిఫిన్ కి ఇవి తీసుకోవద్దు. నూడుల్స్ తినడం సాయంత్రం మేలు ఉదయం టిఫిన్ గా నూడుల్స్ వద్దు అంటున్నారు నిపుణులు. ఉదయంపూట బయట ప్రాసెస్ చేసిన పళ్ల రసాలు తీసుకోవద్దు. ఇంట్లో చేసినవి తీసుకుంటే ఉత్తమం. పకోడి కచోరీ ఆయిల్ లో వేయించిన బోండాలు ఇవన్నీ కూడా అల్పహారంగా వద్దు అంటున్నారు నిపుణులు.