మనలో చాలా మంది ఉదయం టిఫిన్ తీసుకుంటాం . ఇంకొందరు భోజనం కూడా చేస్తారు. కొందరు మితంగా తీసుకుంటారు బ్రెడ్ జామ్ ఇలా. అయితే మరికొందరు చపాతీ పరాటా ఇలా కూడా తీసుకుంటారు. అయితే వైద్యులు చెప్పేది ఏమిటి అంటే అతిగా ఆయిల్ ఉండే ఫుడ్ తీసుకోవద్దు అని చెబుతున్నారు .రొట్టెలలో కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే గ్యాస్ సమస్య వస్తుంది. ఉదయం పరాటా తీసుకోకుండా ఉంటే మంచిది.
అలాగే ఉదయం లేవగానే అరటిపండు కూడా కొందరు తీసుకుంటారు. ఈ అలవాటు మంచిది కాదు. అందుకే ఉదయం పూట అరటిపండు అస్సలు తీసుకోవద్దు. ఇక మరో విషయం ఉదయం పెరుగుని కొందరు తీసుకుంటారు
పెరుగులోని ఆమ్లత్వం కారణంగా అసిడిటీ సమస్యలు వస్తాయి ఎక్కువగా తీసుకుంటే దగ్గు జలుబు వేధిస్తుంది.
బ్రేక్ ఫాస్ట్ లో మాత్రం టమాటాలు తినవద్దు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఎసిడిటి గుండెల్లో మంట ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇక ఉదయం టిఫిన్ లో అయినా మీల్స్ తీసుకునే అలవాటు ఉన్నా అందులో పచ్చళ్లు నిలువ ఊరగాయలు వద్దు అంటున్నారు నిపుణులు. నిమ్మకాయలు, నారింజలు, సిట్రస్ పండ్లు కూడా వద్దు అని చెబుతున్నారు. దీని వల్ల గుండెల్లో మంట సమస్యలు వస్తాయి.