చాయ్ అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. కాస్త అలసట వచ్చినా తలనొప్పి వచ్చినా ఓ కప్పు చాయ్ గొంతులో పడాల్సిందే. ఇక ఉదయం అయితే టీ తాగనిదే మన పని ముందుకు సాగదు. అయితే టీకి ఇంతలా అడిక్ట్ అవ్వడానికి కారణం? మనకు ఇది తాగగానే ఉత్సాహం వస్తుంది. అయితే చాలా మంది టీ తో బిస్కెట్, రస్క్ ఇలాంటివి తీసుకుంటారు. కాస్తా లాంటివి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మర్చిపోయాం.
అయితే టీతో బిస్కెట్ ఎక్కువగా తీసుకుంటారు. కొందరు బజ్జీ పకోడి ఇలాంటివి తీసుకుంటారు. కాని టీతో తీసుకోకూడని కొన్ని ఉన్నాయి .మరి వైద్యులు అవి ఏమిటో చెబుతున్నారు సో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని టీతో తీసుకోకూడదు. సింపుల్ గా ఎందుకో చెప్పుకుందాం. మనం తాగే టీలో టానిన్లు ఉంటాయి ఇవి ఐరన్ ని గ్రహించడం ఆపేస్తాయి. అలాగే మీరు చిక్కుడు కూర , అలాగే గింజల కూరలు తిని అస్సలు టీ తాగకూడదు. ఇక నిమ్మ అలాగే టీ కలిపి అస్సలు తీసుకోకూడదు. ఇది చాలా డేంజర్ గ్యాస్ అలాగే ఆమ్లత్వం శరీరంలో పెంచేస్తుంది. పకోడిలు, నామ్ కీన్ తో టీని కలిపి తీసుకోకూడదు. ఇక చాలా మంది బజ్జీలు తింటూ టీ తాగుతారు, ఇది కూడా గ్యాస్ ని కడుపులో ఉబ్బరాన్ని పెంచుతుంది. ఇక పాలల్లో పసుపు వేసుకోవచ్చు టీ లో మాత్రం పసువు వేసుకోవద్దు.