మనలో చాలా మంది రాత్రి పడుకునే ముందు కూడా ఏదో ఒక ఫుడ్ తింటారు. భోజనం చేసిన ఓ గంట రెండు గంటలకు కాస్త గ్యాప్ ఇచ్చి తినేవారు ఉంటారు. అయితే పడుకునే రెండు మూడు గంటల ముందు మీరు ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇక పడుకునే పది నిమిషాల ముందు అన్నం తినడం ఏదైనా ఫుడ్ తినడం మంచిది కాదు. అందుకే తిన్న వెంటనే పడుకోవద్దు అంటున్నారు నిపుణులు.
నిద్రపోవడానికి 3 గంటల ముందు తినడం ఆరోగ్యానికి మంచిది. మరీ ముఖ్యంగా నిద్ర వేళ కొన్ని ఆహారాలు తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది చూద్దాం.
1. పిజ్జా బర్గర్లు ఆయిల్ ఫుడ్
2. బజ్జీలు సాల్ట్ మసాలా కలిగిన ఫుడ్స్
3. బాగా రోస్ట్ ఫ్రై చేసిన ఫుడ్
4. నూడిల్స్
5. ఫైబర్ లేని ఫుడ్ కూడా వద్దు
6. చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్
7.సోడా కూల్ డ్రింకులు
8.జీర్ణం సరిగ్గా అవ్వని కొన్ని రకాల పండ్లు తీసుకోవద్దు, పైనాపిల్, పనస రాత్రి వద్దు
9.పడుకునే ముందు మొలకలు కూడా తీసుకోవద్దు.
10. నాన్ వెజ్ రాత్రి అవాయిడ్ చేయడం మంచిది.