కొవిడ్ భయంతో ఈ మందులు వాడద్దు – తప్పక తెలుసుకోండి

Do not use these drugs for fear of Covid

0
69

ఈ మధ్య ఇంటిలో ఎవరికైనా కరోనా వస్తే వెంటనే, మిగిలిన ఇంటి సభ్యులు త్రి డేస్ కిట్ వాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏ లక్షణాలు లేని వారు కూడా ఈ మందులు వాడుతున్నారు. తాజాగా కరోనా చికిత్సలో పలు కీలకమైన మార్పులు చేసింది కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ . ఎవరికైనా కరోనా లక్షణాలు లేకపోతే అసలు ఎలాంటి మందులు వాడకండి. ముందు జాగ్రత్తగా కొందరు ఈ మందులు వాడుతున్నారు ఇలా వాడద్దు అని తెలిపింది.

స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లు యాంటీపైరెటిక్, యాంటీట్యూసివ్ మందులు మాత్రమే వాడాలని చెప్పింది. కొవిడ్ చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింక్, మల్టీ విటమిన్ల వంటి ట్యాబ్లెట్లు అవసరం లేదని తేల్చి చెప్పింది. సో మనకు కరోనా వస్తుంది అనే భయంతో చాలా మంది ఇలాంటి డోసులు వాడుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా ఈ మందులు వాడద్దు అంటున్నారు వైద్యులు.

జ్వరం కోసం యాంటీపైరెటిక్, జలుబు కోసం యాంటీట్యూసివ్ మందులు మాత్రం వాడితే చాలని తెలిపింది. ఇక చాలా మంది కరోనా వస్తే వెంటనే సిటీ స్కాన్లు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. ఇక అనవసరంగా సిటీ స్కానింగ్ వద్దని తెలిపింది. ప్రతీ ఒక్కరు పోషకాహారం తీసుకోవాలని, అందరూ జాగ్రత్తలు పాటించాలని ,మాస్క్ ధరించాలని, భౌతికదూరంపాటించాలని తెలిపింది.