ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు కన్నీళ్లు వస్తున్నాయా? అయితే ఇలా చేయండి..

0
81

సాధారణంగా అందరు ఉల్లిపాయను కూరల్లో వెయ్యడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఎందుకంటే ఉల్లిపాయ కూరలో వేయడం వల్ల రుచి, సువాసన బాగుంటుందనే కారణంతో వేస్తుంటారు. కానీ దీనిని కోసేటప్పుడు కళ్ళు మండడం, కంటి నుండి నీరు కారడం వంటి సమస్యలు రావడం వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుక ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి..

ఉల్లిపాయను కట్ చేసేటప్పుడు కత్తికి కాస్తంత నిమ్మరసం పూయండి. దీనివల్ల కళ్ళు మండడం, కంటి నుండి నీరు కారడం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఉల్లిపాయను తిప్పి కట్ చేయటం వల్ల ఘాటు అధికంగా రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయను కట్ చేసేటప్పుడు కొవ్వొత్తిని పెట్టుకోవడం వల్ల ఉల్లి నుంచి విడుదలయ్యే గ్యాస్ ని కొవ్వొత్తి పీల్చుకుంటుంది.

దీనివల్ల కళ్ళకు నీళ్ళు రావు. ఉల్లిపాయని కట్ చేసే ముందు రెండు గంటల పాటు ఫ్రిడ్జిలో పెట్టాలి. ఆ తరువాత కట్ చేస్తే ఉల్లిలో విడుదలయ్యే ఎంజైమ్స్ ఎక్కువ పరిమాణంలో ఉండవు. దీనివల్ల కళ్ళు మండడం, కంటి నుండి నీరు కారడం జరగవు. అంతేకాకుండా ఉల్లిపాయని కోసే ముందు కొంచెం సేపు సూర్యరశ్మికి పెట్టడం వల్ల కళ్ళు మండవు.