మనలో చాలా మంది జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. భోజనం చేసిన తరువాత అలాగే చేయడానికి ముందు కొన్ని రకాల నియమాలను పాటించక పోవడం వల్ల మనం ఈ జీర్ణసంబంధిత సమస్యల బారిన పడుతున్నామని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల బారిన పడడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
భోజనం చేయక ముందు అలాగే భోజనం చేశాక చేయకూడనివి 5 పనులు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యాహ్నం అలాగే రాత్రి భోజనం చేసిన తరువాత వెంటనే నిద్రించకూడదు. భోజనం చేసిన వెంటనే నిద్రించడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. దీని వల్ల కడుపులో మంట ఆరంభమై క్రమేపీ అది ఎసిడిటీకి దారి తీస్తుంది.
ఇక భోజనం చేసిన తరువాత చేయకూడని వాటిల్లో రెండోవది పొగ తాగడం. భోజనం తిన్న తరువాత అది జీర్ణం కావడానికి కొన్ని గంటలు పడుతుంది. చాలా మంది తిన్న వెంటనే పొగ తాగుతూ ఉంటారు. దీని వల్ల నికోటిన్ శరీరంలోకి చేరుతుంది. భోజనంతోపాటు ఈ నికోటిన్ జీర్ణమవ్వడానికి అధిక ఆక్సిజన్ అవసరమవుతుంది.
భోజనం చేసిన తరువాత వెంటనే స్నానం చేయడం వల్ల కాళ్లలో రక్తపోటు పెరుగుతుంది. పొట్ట భాగంలో రక్తప్రసరణ తగ్గుతుంది. దాని ఫలితంగా జీర్ణవ్యవస్థ మందగించి కడుపు నొప్పికి దారి తీస్తుంది.
అలాగే భోజనం చేసిన తరువాత టీ తాగకూడదు. చాలా మంది భోజనం చేసిన తరువాత టీ తాగే అలవాటును కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం తరువాత టీ తాగకూడదు.
ఈ నియమాలను పాటించడం వల్ల చాలా వరకు జీర్ణసంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.