ఈ రోజుల్లో చాలా మందికి మలబద్దక సమస్య వేధిస్తోంది. మరీ దారుణం ఏమిటి అంటే ఏకంగా చిన్నపిల్లలని కూడా ఈ మలబద్దక సమస్యలు వేధిస్తున్నాయి. అయితే పిల్లల్లో మలబద్ద సమస్య ఉంది అంటే వారు అంత చురుకుగా ఉండరు. ముఖ్యంగా వారికి ఏదైనా చిన్న చిన్న పనులు వ్యాయామం ఇలాంటివి అలవాటు చేయండి.
అంతేకాదు అస్సలు జంక్ ఫుడ్ ఇవ్వకండి. అలాగే చాలా గట్టిగా ఉండి అరుగుదలకు టైమ్ పట్టే ఫుడ్ ఇవ్వద్దు. ద్రవపదార్దాలు జ్యూస్ ఇలాంటి పండ్లు ఇవ్వండి. చాలా వరకూ మలబద్దక సమస్య తగ్గుతుంది. రాత్రిపూట సరైన సమయానికి నిద్రపోయేలా చూడండి. అంతేకాకుండా మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి. నీరు ఎక్కువ తాగినా మలబద్దక సమస్య తగ్గుతుంది.
ఉదయం పిల్లలలకు 4-5 నానబెట్టిన ఎండు ద్రాక్షలను ఇవ్వాలి. ఉడకబెట్టిన ఆహార పదార్థాలను వారికి తినిపించడం మంచిది.
షుగర్ ఫుడ్ చాలా వరకూ తగ్గించాలి. జంక్ ఫుడ్ తగ్గిస్తే ఈ సమస్యలు చాలా వరకూ ఉండవు. చిన్నపిల్లలను ఆటలకు ఎక్కువగా ప్రొత్సహించాలి. వ్యాయామం కూడా అలవాటు చేయండి. ఇవన్నీ కూడా వారిలో ఎంతో శక్తిని ఇస్తాయి. అయినా ఈ సమస్య తగ్గకపోతే కచ్చితంగా వైద్యులని సంప్రదించండి